కిట్స్‌ విద్యార్థులు 317మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌

  • చైర్మన్‌ లక్ష్మీకాంతరావు వెల్లడి

వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన 317మంది విద్యార్థులు ఎంపికైనారని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) చైర్మన్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.5లక్షల నుండి రూ.15.5 లక్షల వరకు సీటీసీని ఆయా కంపెనీలు అందిస్తాయన్నారు. 2025-2026 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో 50కి పైగా బహుళజాతి అగ్రశ్రేణి ఐటీ, కోర్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలలో బి.టెక్‌ విద్యార్థుల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు 317 మార్కును చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుత సెమిస్టర్‌ కోసం ఎల్‌టీఐ, మైండ్‌ ట్రీ, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, టీ-టెక్‌, చబ్బ్‌, ఈడబ్ల్యూజీసీఎస్‌, రియల్‌పేజ్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, డెక్స్టారా, అశోక బిల్డర్స్‌, నార్తర్న్‌ టూల్స్‌, మేధా సర్వోడ్రైవ్స్‌, టీసీఎస్‌, టెక్నీపీఎఫ్‌ఎంసీ వంటి ప్రఖ్యాత ఎంఎన్‌సీలు ప్రస్తుత చివరి సంవత్సరం బి.టెక్‌, ఎం.టెక్‌ విద్యార్థులు మొత్తం 317మందిని ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కిట్స్‌ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సాంకేతిక ప్రపంచ దిగ్గజ ఎమ్‌ఎన్‌సి కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లను నిర్వహించడానికి అనేక కంపెనీలు లైన్‌లో ఉన్నాయని లక్ష్మీకాంతరావు తెలిపారు. విద్యార్థులు ఎల్లవేళలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నెమరువేసుకుంటూ ఉద్యోగ సముపార్జనలో నిమగ్నం కావాలని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి కోరారు. బి.టెక్‌ చివరి సంవత్సరం 2025-2026 బ్యాచ్‌కి చెందిన సిఈ, ఎంఈ, సిఎుస్‌ఎం, సిఎస్‌ఈ, సిఎస్‌ఎన్‌, సిఎస్‌ఓ, ఐటి, ఈసిఈ, ఈసి ఐ అండ్‌ ఈఈఈ వంటి 10 బ్రాంచ్‌ల 317మంది విద్యార్థినీవిద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఇన్నోవేషన్‌ ఇంక్యుబేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సి-ఐ స్క్వేర్‌ అర్‌ ఈ) కార్యకలాపాలపై దృష్టి సారించే పాఠ్యాంశాల ఆధారంగా బోధన అందిస్తూ నిరంతరం తాజా సాంకేతిక సాధనాలతో సమలేఖనం చేసినట్ల ఆయన వివరించారు. 317మంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం సభ్యులు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణ రెడ్డి, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అశోక రెడ్డి, డీన్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రొఫెసర్‌ వై.పురంణర్‌, టీపీవో డాక్టర్‌ టి.చంద్రబాయి, కార్పొరేట్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ ఇ.కిరణ్‌ కుమార్‌, వివిధ విభాగాల డీన్స్‌, విభాగాదిపతులు మరియు పీఆర్వో డాక్టర్‌ డి.ప్రభాకరాచారి, ఆప్టిట్యూడ్‌ ట్రైనర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జి.ధనుష్‌, డి.శరత్‌, పి.సింధూర, పి.అరుణకుమారి, వివిధ విభాగాల హెడ్‌లు, డీన్‌లు, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *