కేబుల్‌ ఆపరేటర్స్‌ను ఆదుకోవాలి

– బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావ
– రేపటి వారి ధర్నాకు మద్దతు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: కేబుల్‌ ఆపరేటర్స్‌ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, చిన్నస్థాయి కేబుల్‌ ఆపరేటర్స్‌ తాము ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, సవాళ్ల గురించి ఆయనను కలిసి వివరించారు. శనివారంనాడు ఇందిరా పార్కులో తలపెట్టనున్న వీరి ధర్నాకు బీజేపీ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కేబుల్‌ ఆపరేటర్స్‌ చాలా నష్టాల్లో ఉన్నారని, రామంతాపూర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత కేబుల్‌ ఆపరేటర్స్‌ను ఇబ్బందిపెట్టేలా, ఉపాధి కోల్పోయేలా పరిస్థితి సృష్టించిందని అన్నారు. లక్షా 50 వేల మందికిపైగా కేబుల్‌ ఆపరేటర్స్‌, సిబ్బంది ఉన్న ఈ చిన్నపాటి ఇండస్ట్రీపై అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని రామచందర్‌రావు తెలిపారు. పలు ప్రాంతాల్లో కేబుల్‌ వైర్లు తొలగించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. దీంతో లక్షలాదిమంది కేబుల్‌ ఆపరేటర్స్‌ నష్టపోయే ప్రమాదం ఉందని, ఉపాధి కోల్పోతున్నారని, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపించేందుకు ప్రయత్నం చేయాలని, కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం ఆప్టిక్‌ ఫైబర్‌ కనెక్షన్లను కేబుల్‌ ఆపరేటర్స్‌కు అందిస్తూ వారి వద్ద అద్దె తీసుకుంటూ వారు సేవలందించడానికి సహాయం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆప్టిక్‌ ఫైబర్‌ సౌకర్యాలను కేబుల్‌ ఆపరేటర్స్‌కు అందిస్తే వారికి మేలు జరుగుతుందని రామచందర్‌రావు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *