హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగర కేంద్రంగా స్టూడియోలు కలిగి స్థానికంగా, జిల్లాలలో ప్రసారాలు అందించే చానళ్ళు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్డులు పొందటానికి, జిల్లా స్థాయిలో స్టూడియోలు కలిగిన వారు ఆయా జిల్లాల్లో కార్డులు పొందటానికి నేరుగా ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులో ఛానల్ పేరు, స్టూడియో అడ్రస్ తో పాటు, ఎమఐబి సర్టిఫికెట్, లేబర్ లైసెన్స్, ఎంఎసఓలతో చేసుకున్న ఛానల్ ప్లేస్‌మెంట్ అగ్రిమెంట్ల కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అర్హత గల ఛానళ్లకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడేషన్స్ జారీ చేస్తారని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




