హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్12: బుధవారం(12వ తేదీ) జరగాల్సిన కేబినెట్ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీన జరగనున్నది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వాస్తవానికి కేబినెట్ సమావేశం ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉందీ. కానీ సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఫలితం తేలిన మరుసటి రోజున (15న) కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





