– తిరిగి 12న జరపాలని నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై చివరిసారిగా జరిగిన కేబినెట్‌లోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టు గత కేబినెట్ సమావేశం సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



