– తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
– దిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– బీసీలకు న్యాయం కోరుతూ భారీ ధర్నాకు పిలుపు
– బీసీ బిల్లు పెండింగ్.. దిల్లీ పర్యటనతో దూకుడు
– స్థానిక ఎన్నికల ముందే రిజర్వేషన్లపై క్లారిటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సెక్రటేరియట్‌లో మంత్రులు కొండా సురేఖ, వాకిటీ శ్రీహరితో కలిసిన ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్ట్ 5,6,7 తేదీల్లో ముఖ్యమంత్రి , లోకసభ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులురాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ కూటమి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఢిల్లీ వెళ్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు ఆమోదింప చేయాలి బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలతో సహా పార్టీలో ఉన్న బీసీ నాయకులు అరవింద్ , బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య ,లక్ష్మణ్ ఐదుగురు బీసీ ఎంపీలు ఉన్నారు .. వారిని అడుగుతున్నాం.. రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును ఆమోదింప చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ బీసీ నాయకత్వం దాని ఖండించి బలహీన వర్గాలకు మద్దతు తెలుపాలని రిక్వెస్ట్ చేశాం.. గతంలో కేశవరావు , నేను, వాకిటి శ్రీహరి, మహేష్ గౌడ్, బలహీన వర్గాల శాసనసభ్యులు, ఎంపీలు అందరం కలిసి చేతులెత్తి దండం పెట్టాం . తెలంగాణ ఉద్యమం లాగ స్పూర్తి దాయకంగా బలహీన వర్గాలకు అవకాశం వస్తుంది. 90 శాతం కి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. శాసనసభలో నిజాయితీగా బిల్లులకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బిల్లుకు మోకాలడ్డుతున్నారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ లో ఉన్న బిసీ మేధావులు, నాయకులు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా పోరాడేమో ఈ కీలకమైన దశలో మనం అలా పోరాడాలి .గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్లు కాపాడుకోవడానికి మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని కుల సంఘాలది బీసీ సంఘాలది, బీసీ మేధావులదని అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, క్యాబినెట్, మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కట్టుబడి ఉన్నామన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ఏకగ్రీవంగా ఈ అంశాలు చర్చించింది రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులపై సమయం దాటిపోతున్నది కోర్టు ఎన్నికలు జరపాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.





