కేబినెట్‌ నిర్ణయం చరిత్రాత్మకం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేశామని, నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరపాలని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 19వ కేబినెట్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన సెక్రటేరియట్‌ వద్ద మంత్రులు పొంగులేటి, జూపల్లి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 4న తీసుకున్న నిర్ణయం మేరకు కుల గణన సర్వే చేయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఇప్పటికే చట్టం చేశామని తెలిపారు. పలు పార్టీలు రాజకీయాలకు, మాటలకే పరిమితం కాకుండా బీసీల 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి రోల్‌ మోడల్‌ గా ఎంపెరికల్‌ డేటా సేకరించిందని ఆయన వివరించారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 17 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్‌ ఇచ్చి జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉంన్నామని, మార్చి లోపు లక్ష ఉద్యోగాలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఆఫీసర్స్‌ కమిటీ వేసి పరిష్కరించాలని నిర్ణయం తీసుకుందని పొన్నం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *