జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

– నేటినుంచి నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుందని ఎన్నికల సంఘం తెలిపింది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్‌ వచ్చే నెల 11న పోలింగ్‌, 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో కౌంటింగ్‌ జరగనున్నాయి. 16వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కార్యాలయంలో నేరుగా లేదా ఆన్‌లైన్‌ విధానంలో దాఖలు చేసే అవకాశం ఉంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు వెల్లడిరచారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలని పేర్కొన్నారు. ఇండిపెండెంట్‌, గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు పదిమంది నియోజకవర్గ ఓటర్లు ప్రతిపాదించాలని వివరించారు. అభ్యర్థి స్వయంగా లేదా ప్రతిపాదకుల్లో ఒకరు వచ్చి నామినేషన్‌ దాఖలు చేయవచ్చన్నారు. వెబ్‌సైట్‌ https://encore.eci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్‌ పత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చని, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ప్రిండెట్‌ హార్డు కాపీని రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందించాలని అధికారులు స్పష్టం చేశారు.

మొదటి రోజు పది నామినేషన్లు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున మొత్తం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 11 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయని నియోజకవర్గ ఎన్నికల అధికారి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *