ఇక ‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో ఆర్టీసీ బస్ టిక్కెట్

– యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, మీసేవ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి మీ మొబైల్ యాప్‌ను మంగళవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆరఎస్ సేవలను కూడా అనుసంధానిస్తుంది. ప్రయాణికులు సుదూర ప్రయాణాలు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
యాప్ ద్వారా అందించే సేవలు :
మొత్తం ఓపీఆరఎస్ సేవలు: 1,710
ఏ/సీ సేవలు: 450
నాన్-ఎ/సి సేవలు: 1,260
రోజువారీగా బుక్´ ఆయ్యే సీట్లు 13,000
ముఖ్యమైన గమ్యస్థానాలు : బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసి|ఫాబాద్, వరంగల్.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఐదు రకాల బస్ పాస్‌లు పొందే సౌకర్యం. మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉన్నాయి. బస్ పాస్ మాడ్యూల్ హైదరాబాద్ నగరంలోని ప్రయాణికులకు మొబైల్ యాప్ ద్వారా నెలవారీ బస్ పాస్‌లను డిజిటల్‌గా తీసుకోవడానికి, పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుంది.
అందుబాటులో ఉన్న కేటగిరీలు, చార్జీలు:
1. సిటీ ఆర్డినరీ పాస్ రూ.1,400/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: 8,000)
2. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,600/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: 46,500)
3. మెట్రో డీలక్స్ పాస్- రూ.1,800/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: ?12,000)
4. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ నెలవారీ పాస్ అమ్మకాలు: రూ.2,200/నెల (సగటున నెలవారీ
5. పుష్పక్ ఏసీ పాస్ రూ.5,000/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: 450)
3. టి 24 టికెట్ (జంట నగరాలు)
గ్రేటర్ హైదరాబాద్ జోన్ (జంట నగరాలు) పరిధిలో కార్యకలాపాల కోసం టీ24 టికెట్‌ను మీ టికెట్ మొబైల్ యాప్‌లో విలీనం చేశారు. టి-24 టికెట్ అనేది 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్. ఇది యాక్టివేషన్ సమయం నుండి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో అపరిమిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది.
రోజువారీ సగటు అమ్మకాలు: 16,830 టిక్కెట్లు
చార్జీల నిర్మాణం: పెద్దలు-రూ.130, పిల్లలు – రూ.90
మహిళలు (ఇతర రాష్ట్రాలు)/ సీనియర్ సిటిజన్ – రూ.110
టీ-24 టికెట్ పర్యాటకులకు, అప్పుడప్పుడు ప్రయాణించే వారికి, ఒకే రోజులో బహుళ ట్రిప్పులు అవసరమయ్యే ప్రయాణికులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైౖజర్ విజయపుష్ప, సిటీఎం శ్రీదేవి, సిఈ(ఐటి) శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి ఆరఎం లు సుధాపరిమళ, శ్రీలత, పలువురు అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *