హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు బస్సు పునరుద్ధరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశంతో అధికారులు సత్వర చర్యలు తీసుకుని హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలకు బస్సు సర్వీసును పునరుద్ధరించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ రోయింగ్‌ విద్యార్థులు ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్‌కు రాకపోకలు చేస్తుంటారు. ఉదయం 5 గంటలకు స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి ప్రారంభమై హుస్సేన్‌సాగర్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ రోయింగ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ శిక్షణ అనంతరం తిరిగి 9:30 గంటలకు కు పాఠశాలకు చేరుకోవాలి. 9.45 నుండి వారికి తరగతులు పారంభమవుతాయి. అయిదేళ్ల క్రితం స్పోర్ట్స్‌ స్కూల్‌కు చెందిన బస్సు పాడైపోయింది. దానిని మరమ్మతు చేయించడం కానీ, ప్రైవేటు బస్సును కానీ వారి కోసం ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ను సందర్శించగా పలువురు విద్యార్థులతోపాటు స్పోర్ట్స్‌ స్కూల్‌ అధికారులు మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన క్రీడా శాఖ మంత్రి వెంటనే బస్సును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సును ి కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతినిత్యం బస్సు కోసం హకీంపేటలో, హుస్సేన్‌సాగర్‌ వద్ద పడిగాపులుకాసే విద్యార్థుల సమస్యకు తెరపడిరది.

కరీంనగర్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌ను ప్రారంభించి, యోగా, జిమ్నాస్టిక్స్‌ హాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, ఎమ్మెల్యేలు విజయ రమణరావు ,మేడిపల్లి సత్యం, సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి, స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి రవీందర్‌ డాక్టర్‌ రవితేజ, ఇంజనీర్‌ అశోక్‌ కుమార్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ బాషా, డివైఎస్‌ఓ నరేందం,్‌ ’సుడా‘ చైర్మన్‌ నరేందర్‌, పలువురు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *