ఛత్తీస్‌గఢ్‌ ‌లో ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా

– ఐదుగురు ప్రయాణికుల మృతి

రాయ్‌పూర్‌,‌మార్చి 6: ఛత్తీస్‌గఢ్‌ ‌లోని జాష్‌పూర్‌ ‌జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానం చేరుకుంటామనే లోపు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌ ‌సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిట‌ల్స్‌కు తరలించారు. తప్కరా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని గోడాంబ గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని కుర్దేగ్‌ ‌నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురి పట్టణం వైపు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో బస్సులో ఐదుగురు మృతిచెందారని జాష్‌పూర్‌ ‌సీనియర్‌ ‌పోలీసు సూపరింటెండెంట్‌ ‌లాల్‌ ఉమేద్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *