ఖాట్మండ్, ఫిబ్రవరి 23: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు లోయలో పడి 18మంది మృతిచెందారు. మరో 28మంది గాయపడ్డారు. పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 Tందికి పైగా ప్రయాణికులు ఱన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే అతివేగం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



