లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

– 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి21: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్కు  చెందిన బస్సు ఓవ‌ర్ టేక్‌ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా సుజ్జసుజ్జు అయింది. ముఖ్యంగా క్యాబిన్ భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిట‌ల్‌కు తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *