– బీజేపీ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల తీరును ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటిదని, అక్కడ ప్రజా సమస్యలపై చర్చించే గౌరవనీయమైన వేదికగా దాన్ని చూడాల్సిందిపోయి పిక్నిక్ స్పాట్‌లా మార్చి జోకులు వేసుకుంటూ టీలు తాగడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు. సభలో చర్చించే దమ్ము లేదు.. బయట నిబంధనలు పాటించే ఓపిక లేదు. రాహుల్ గాంధీకి పార్లమెంటు అంటే పిక్నిక్ స్పాట్‌గా మారింది.. ఇది ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఉందంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర మంత్రి లెక్కలతో వివరణ ఇచ్చిన తర్వాత కూడా సమాధానం వినకుండా బయటకు వచ్చి సస్పెండ్ అయిన ఎంపీలతో కలిసి పార్లమెంటు ఆవరణలో టీ తాగుతూ, బిస్కెట్లు తింటూ పార్లమెంటరీ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీలకూ అంతే బాధ్యత ఉండాలని, కానీ కాంగ్రెస్ ఆ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బాధ్యతాయుత నాయకత్వంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయిని యునైటెడ్ నేషన్స్ సమావేశాలకు పంపిన సందర్భాన్ని గుర్తు చేస్తూ దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలÅ£తీతంగా వ్యవహరించారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆ విలువలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. స్పీకర్ విధించిన నిబంధనలను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. భారత ప్రజలను అవమానించిన ఈ చర్యకు నిరసనగా రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





