– వర్థంతి సందర్భంగా గుర్తు చేసుకున్న సిఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13 :డాక్టర్. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బహు భాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. రెవెన్యూ మంత్రిగా వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్ధత కల్పించి భూ సంస్కరణలకు నాంది పలికారన్నారు. బూర్గుల గారి రాజకీయం, న్యాయ వ్యవస్థలపై అవగాహన, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన తెలిపారు. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్క•తిక రంగాల్లో విశిష్టమైన సేవలందించారని ఆయనను గుర్తుచేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





