సంక్షేమం దిశగా బడ్జెట్

 – విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ

                                                                                (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

రేవంత్రెడ్డి సర్కార్ 2026-27 వార్షిక బడ్జెట్లో అయిదు ప్రధానాంశాలను దృష్టి లో పెట్టుకుంది. ప్రజా సంక్షేమం, సామాజి క న్యాయం నినాదంగా ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వం బడ్జెట్లో విద్య, వైద్య, వ్యవ సాయ నీటిపారుదల, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత నిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో ఏక కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఈ ఆర్థిక సంవత్సరానికిగాను 3లక్షల 24వేల 234 కోట్ల బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో ఈసారి విద్యాశాఖకు తగిన ప్రధాన్యతనిచ్చారు. నేటి బాలురే రేప టి పౌరులన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. విద్యారంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను తీ ర్చిదిద్దాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాంతోపాటు విద్యార్థుల ఆరో గ్యం, పోషణ, భవిష్యత్లో ఉపాధి అవకా శాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టు కుని ఈసారి విద్యారంగానికి 26,674 కో ట్లను కేటాయించడమే కాకుండా సంచల నాత్మక నిర్ణయాలనుకూడా ప్రకటించింది. ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకు మాత్ర మే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని మరింత విస్తరిం చాలన్న నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఈ పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ప్రవేశ పెట్టాలని నిశ్చయించింది. ఈ బ్రేక్ ఫాస్ట్లో భాగంగా ప్రతీ విద్యార్థికి
వారంలో మూడు రోజులు పాలు ఇస్తారు. అలాగే మిగతా మూడు రోజులు రాగి జావ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదివేవారి సంఖ్య పెరిగే అవకాశముంటుందని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. దీంతోపాటు మరో సంచలనాత్మక నిర్ణయాన్ని కూడా ప్రభు త్వ తీసుకుంది. రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలొజీ సెం టర్ (ఏటిసి)లలో శిక్షణ పొందుతున్న వారితోపాటు ఐటిఐ విద్యార్థులకు నెలకు రెండు వేల రూపాయల ఉపకార వేతనా న్ని అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. అలాగే పాలిటెక్నిక్ విద్యార్ధులకుకూడా మరో శుభవార్తను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. పాలిటెక్నిక్లో ప్రస్తుతమున్న కోర్సులకు తోడు మరో 15 రకాల కొత్తకో ర్సులను ఈ విద్యాసంవత్సరం నుండే ప్రవేశపెడుతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని 57 పాలిటెక్కికల్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలోజీ సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పర్చనుందని భట్టి పేర్కొనడం గమనా ర్హం. దీనివల్ల భవిష్యత్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకా శాలు మెరుగవటంతోపాటు, వారు ఎంటర్పెన్యూర్లుగా ఎద గడానికి దోహదపడుతుందన్నారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న భట్టి, ఉస్మా నియా విశ్వ విద్యా లయానికి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిదంగా వీరనారి చాకలి అయి లమ్మ మహిళ విశ్వవిద్యా లయానికి ఈ బడ్జెట్ లో 400 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశోధన, విద్యార్థుల ఇతర అవసరాలను తీర్చనున్నట్లు తెలిపారు. మరో సంచలనాత్మక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్ళను ఏర్పా టు చేయడం. ఇందుకో సం ఈ బడ్జెట్లో 500 కోట్లను కేటాయిస్తున్న విషయాన్ని భట్టి ప్రకటించారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శి టీ ఏర్పాటు కూడా. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్టస్ యూనివర్శిటీని ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. కాగా దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలను త్వరలో పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని భట్టి వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *