31 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

– 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి
– ఉగాది, రంజాన్, శ్రీరామ నవమికి సెలవులు

హైదరాబాద్. ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల‌ 31 వరకు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమ‌వారం జ‌రిగిన‌ బీఏసీ సమావేశంలో ఈమేర‌కు నిర్ణయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విష‌యం విదిత‌మే. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. మంగ‌ళ‌, బుధ‌వారాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 20న ప్రభుత్వం బడ్జెను ప్రవేశపెట్టనుంది. ఆపై 23 నుంచి 26 వరకు బడ్జెట్ పై చర్చలు జరపనున్నారు. 31న ద్రవ్య వినిమియ బిల్లుపై చర్చ జరగనుంది. కాగా, ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి అసెంబ్లీకి సెలవులు ప్రకటించనున్నారు. బీఏసీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, కేపీ వివేక్ హాజరవగా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *