విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్‌

– పీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 20:  రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈరోజు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు ఆశా జనకంగా లేవ‌ని పి టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్ ఆరోపించారు. మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు కాగా అందులో విద్యకు కేవలం 26674 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్ లో 8.2% మాత్రమే. గత సంవత్సరం 7.6% కేటాయించగా ఈ సంవత్సరం పెరుగుదల కేవలం 0.6% మాత్రమే. విద్యా రంగం అభివృద్ధి కి ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవాల్సిన పీఆర్‌సీ, డీఏ ల గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరం. ఈహెచ్ ఎస్‌ అమలు విషయాన్ని, విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడాన్ని స్వాగతి స్తున్నామ‌న్నారు.  రాష్ట్రం లోని అన్ని పాఠశాల లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని ఎంపిక చేసిన పాఠశాల లను మాత్రమే అభివృద్ధి చేస్తాం అనడం వివక్షా పూరితం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో లో పెట్టిన విధంగా విద్య కు 15% నిధులయినా కేటాయించాల్సిన అవసరం ఉంద‌న్నారు.

————————————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *