అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్‌ యత్నం

– అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్
‌- ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌చెల్లించాలని డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24:అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్వీ నాయకులు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు బీఆర్ ఎస్‌ కార్యకర్తలను  అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, వాహనాల్లో నాంపల్లి, పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. విద్యారంగంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా బీఆర్ ఎస్‌ నాయకులు మంగ‌ళ‌వారం అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యారంగం పై సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌విడుదల చేయకుండా గోస పెడుతోంద‌ని కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. విడతల వారీగా బీఆర్‌ఎస్వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వస్తుండటంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ‌స్కాలర్‌షిప్‌ ‌నిధులు విడుదల చేయాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ ‌చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఇవాళ బీఆర్‌ఎస్వీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌, ‌తుంగ బాలు మాట్లాడుతూ.. ఉద్యమాలను అణిచివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని అన్నారు. ఇది రాజ్యాంగ హక్కులను హరించడమే అని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్‌ ‌సర్కార్‌ ‌ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. గురుకులాలను పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వ బడులను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని వారు విమర్శించారు. నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సక్ష నిర్వహించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యారంగంపై సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌విడుదల చేయకుండా గోస పుచ్చుకుంటుందని కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై నిప్పులు చెరిగారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *