బీఆర్ ఎస్ పాల‌న దేశానికే రోల్ మోడ‌ల్‌

త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపాం
– ప్ర‌పంచంలోనే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వ‌రం
– ఉప‌రిత‌ల నీటివ‌న‌రుల‌తో తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌
– టీఎస్ఐపాస్‌తో 28వేల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు
– ప్ర‌పంచానికే దిక్సూచి తెలంగాణ‌
– బ్రిడ్జ్ ఇండియా సదస్సులో కేటీఆర్ ప్రసంగం

ధృడ నాయకత్వంప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించింద‌నిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ప్రాధాన్య‌త ఏంటిఅన్న అంశంపై లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు.  తొమ్మిదేళ్ల బీఆర్ ఎస్‌ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారుఅభివృద్దిసంక్షేమ రంగాల్లో విప్లవాత్మక పంథాను అనుసరించి వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులుపాలసీలపై తన అనుభవాలుఆలోచనలను ఈ సదస్సులో కేటీఆర్ పంచుకున్నారుసంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తమ హయాంలో తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందన్నారు

కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సంక్షేమంఅభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందన్న కేటీఆర్బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిశీల పనులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరూ చేయలేదన్నారు. . వివిధ దేశాల రాజకీయ నాయకులుప్రభావశీల వ్యక్తులు హాజరైన ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్తలసరి ఆదాయంలో 12వ స్థానం నుండి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణ నుండి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చన్నారుతమ హయాంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి వ్యక్తుల కంటే విధానాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారువిప్లవాత్మక మార్పులను ఆహ్వానించడంతో పాటు నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడమే తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా మార్చిందన్నారు కేటీఆర్

.
వివిధ దేశాల రాజకీయ నాయకులుప్రభావశీల వ్యక్తులు పాల్గొన్న ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గార్జియస్ డ్యామ్ కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అన్నారుప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకునిపోయి ప్రతీ సీజన్ కు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామన్నారుఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టమ‌న్న కేటీఆర్అందుకు కావలసిన అన్ని రకాల అనుమతులను తీసుకొనిప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామన్నారుఇండియాలో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని అందించడం స్వప్నంగానే ఉన్న సమయంలోకేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇళ్ల‌కు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందన్నారు

దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఉపరితల నీటి వనరులతో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని ఇప్పటి వ‌ర‌కు అందించడం లేదని గుర్తుచేశారు.  తలసరి ఆదాయంలో 156% వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ఒక్కటే అన్నారు.  2014లో తలసరి ఆదాయంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిశీల విధానాలతో 2023 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుందన్నారుబీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్‌మైక్రోసాఫ్ట్అమెజాన్ ,ఫేస్‌బుక్‌తో పాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద క్యాంపస్‌ల‌ను హైదరాబాదులో నెలకొల్పాయని కేటీఆర్ చెప్పారుకార్పొరేట్ సంస్థల్ని హైదరాబాద్ కు ఆహ్వానించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారుతాము అధికారంలోకి రావడానికి ముందు 2014 లో టెక్ పరిశ్రమలో మూడు లక్షల 23వేలు ఉద్యోగాలు మాత్రమే ఉండేవనిఅయితే తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి పది లక్షలకు చేరాయన్నారుఇంతేకాదు 2014లో రూ.56 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు, 2023 నాటికి రూ.2.41కోట్ల‌కు చేరాయ న్నారుఇదంతా తమ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతమార్గదర్శకత్వంతోనే సాధ్యమైందని స్ప‌ష్టం చేశారు.

ఇండియా లాంటి వైవిధ్యభరిత దేశంలో ఒక పరిశ్రమసంస్థను ఏర్పాటుచేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయన్న కేటీఆర్ఆ సంక్షిష్టతను టీఎస్ ఐపాస్ తో తాము దూరం చేశామన్నారుఆన్ లైన్ లో ఎవరైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తాయన్నారుఒకవేళ రాకుంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించి పరిశ్రమను ప్రారంభించుకోవచ్చన్నారుదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధానం లేదన్నారుటీఎస్ఐపాస్ తో తమ హయాంలో 28 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్న కేటీఆర్ఫలితంగా రూ3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయన్నారు24 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పన జరిగిందన్నారుముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలుఅమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందన్నారుఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను అందుకే ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకోవాలన్నారుఅపార అవకాశాలను అందించడంతో పాటు కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ తెలంగాణ లైట్ హౌజ్‌ లాంటిదన్నారుఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *