– ఆరు గ్యారెంటీలపై సభలో నినాదాలు
– బడ్జెట్ బహిష్కరిస్తూ వాకౌట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి గా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మం డిపడింది. బడ్జెట్ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ ఎస్ సభ్యులు ప్రతులను చింపిపారేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ కు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్లడెట్ ప్రసంగం ప్రారంభించగానే.. బీఆర్ఎస్ సభ్యు లు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశా రు. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు తమ చెవుల్లో పూలు పెట్టుకుని సభ నుం చి బయటికి వచ్చారు. ముందుగా బ్లడెట్ ప్రసంగం మొదలవగానే.. ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హాలను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చే శారు. ముఖ్యంగా ‘ఆరు గ్యారంటీల’ అమలు తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘తులం బంగారం మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ప్రభుత్వం పేద మహిళలను వంచించిందని విమర్శించారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం’ అని నినదిస్తూ యువతకు ఇచ్చిన హాని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లో విఫలమైందని మండిపడ్డారు. ఇక ‘బ్జడెట్ మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ఈ బ్జడెట్లో పేదలకు, రెతులకు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని బీఆర్ఎ ఎస్ నేతలు మండిపడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



