బాకీ కార్డులతో గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్లకార్డులతో శుక్రవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డులు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎండగట్టారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ నిరసనలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దివ్యాంగులకు బాకీ పడ్డ రూ.54,000 ఎక్కడ అని నిలదీశారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటూ ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ.24,000లలో సంవత్సరానికి రూ.12,000 చొప్పున రెండు సంవత్సరాలుగా బాకీ ఉందని విమర్శించారు. వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ.4,000 చొప్పున మొత్తం రూ.54,000 బాకీ ఎక్కడ అని నిలదీశారు. పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని అడిగారు. రాష్ట్ర సంపదను దోచుకుంటూ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *