20న మోతెలో భారీ బహిరంగ సభ

– సభాస్థలిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల11: జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, తుల ఉమ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ లక్షకు పైగా ప్రజలు హాజరవుతారని, అందుకు అనుగుణంగా సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రెండున్నరేళ్లలో తెలంగాణ అస్తవ్యస్తమైందని విమర్శించారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జీవన్ రెడ్డి ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించిన ఆయన బీఆర్,ఎస్‌లో చేరారని తెలిపారు. స్థానిక ప్రజలు, కార్యకర్తల అభిప్రాయంతోనే జీవన్ రెడ్డి వచ్చారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి మార్గదర్శనం, సూచనలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *