ఆరు గ్యారెటీలకు చట్టబద్దత

– అసెంబ్లీలో ప్రైవేట్‌ ‌బిల్లుకు బీఆర్‌ఎస్‌ ‌నోటీస్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రైవేటు బిల్లు ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా బిల్లు ప్రతిని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. బిల్లును ఈ సమావేశాల్లోనే అనుమతించాలని కోరారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్‌ ‌మెంబర్‌ ‌బిల్లుకు సంబంధించిన నోటీసును  స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, ‌పార్టీ ఎమ్మెల్యేలు అందజేశారు. ఈ ప్రైవేట్‌ ‌మెంబర్‌ ‌బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ ‌వెల్లడించారు. అత్యంత కీలకమైన ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే  ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేశారు. కేటీఆర్‌ ‌వెంట ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, మల్లారెడ్డి, కేపీ వివేకానందా, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, అనిల్‌ ‌జాదవ్‌, ‌మానిక్‌రావు, దాసోజ్‌ ‌శ్రవణ్‌కుమార్‌ , ‌శంభీపూర్‌ ‌రాజు, మాదవరం కృష్ణారావు, కల్వకుంట్ల సంజయ్‌, ‌కౌశిక్‌ ‌రెడ్డి తదితరులున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *