- గన్ పార్క్ వద్ద ధర్నా..ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు
– సభలో మాట్లాడనీయకుండా మైక్ కట్ చేస్తారా
– స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు అసహనం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి2: శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో ప్రభుత్వం పెట్టే బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రవేశద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. అనంతరం గన్‌పార్క్ వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయని.. వాటిని స్పీకర్ కాపాడాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఏడు రోజుల సభ నిర్వహణపై బీఏసీలో చర్చకు రాలేదని చెప్పారు. సభలో చర్చించే అంశాలను 24 గంటల ముందు పంపాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. నిరసనలు తెలిపేందుకు మైక్ ఇవ్వకపోవడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమేనన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు అని చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏకపక్ష వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ నుంచి గన్‌పార్క్ వద్దకు కాలినకడన వచ్చిన ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇదే రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఇది శాసనసభనా? గాంధీ భవనా అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మూసీ సుందరీకరణ అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
నేరుగా జీరో అవర్‌తో ప్రారంభం దారుణం: బీఆర్‌ఎస్ విప్ వివేకానంద
నేరుగా జీరో అవర్‌తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం దేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద అన్నారు. క్వశ్చన్ అవర్ లేకుండా, ఓ ఎజెండా లేకుండా, సబ్జెక్టు లేకుండా నేరుగా జీరో అవర్‌తో సభను ప్రారంభించడం ఈ మూర్ఖపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేపటి ఎజెండా ఏమిటనేది ముందు రోజే సభ్యులకు తెలియజేస్తే సంబంధిత టాపిక్స్‌పై ఫలవంతమైన చర్చకు అవకాశం ఉంటుందని వివేకానంద అన్నారు. ప్రభుత్వం రాత్రి ఒంటి గంటలకు సభ్యులకు ఎజెండా కాపీలను పంపడం మానుకుని సభను పద్ధతిగా నడపాలని ఆయన హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





