ఉమ్మడి మెదక్‌లో 8 చోట్ల గులాబీదే మెజారిటీ

– 7 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ పైచేయి
– నాలుగుచోట్ల హంగ్

మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మెదక్ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాల్టీలకు గాను కాంగ్రెస్, పార్టీ 7 మున్సిపాల్టీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన ఆందోళ్ జోగిపేట. హుస్నాబాద్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటాను ఎగరవేసింది. సంగారెడ్డి, సదాశివపేట, అందోల్ జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట, హుస్నాబాద్, కోహిర్ మున్సిపాలిటీలను స్వాధీనం చేసుకునే విధంగా ఫలితాలు వెలువడ్డాయి. బీఆరఎస్ పార్టీ 8 మున్సిపాల్టీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తూప్రాన్, జిన్నారం, చేర్యాల, గుమ్మడిదల, ఇంద్రేశం, గడ్డిపోతారం, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాల్టీల్లో బీఆరఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

మెదక్, నర్సాపూర్, జహీరాబాద్, ఇస్నాపూర్‌లో హంగ్

జహిరాబాద్, మెదక్, ఇస్నాపూర్, నర్సాపూర్ మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. ఇక్కడ బీజేపీ కీలకంగా మారింది. మెదక్‌లో 32 వార్డులు ఉండగా బీఆరఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్‌పి 1 గెలుపొందగా బీజేపీ కీలకంగా మారింది. జహీరాబాద్‌లో 37 వార్డులు ఉండగా 15 బీఆరఎస్, 14 కాంగ్రెస్, 3 బీజేపీ, 2 ఎంఐఎం, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇస్నాపూర్‌లో 12 బీఆరఎస్, 10 కాంగ్రెస్ గెలిచినప్పటికీ నలుగురు స్వతంత్రులు గెలవగా వారు కీలకంగా మారారు. బీఆరఎస్‌కి తూప్రాన్, జిన్నారం, చేర్యాల, గుమ్మడిదల, ఇండ్రేశం, గడ్డిపోతారం, దుబ్బాక, గజ్వెల్‌లో దక్కనున్నాయి. గడ్డపోతారంలో 18 వార్డులకు బీఆరఎస్ 14, కాంగ్రెస్ 3, ఇండిపెంటెండ్ 1 గెలుపొందాయి. గుమ్మడిదలలో 22 వార్డులకు బీఆరఎస్ 15, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇండిపెండెట్ 1 గెలుపు సాధించాయి. ఇంద్రేశంలో 18 వార్డులకు బీఆరఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 గెలిచారు. జిన్నారంలో 20 వార్డులకు బిఆరఎస్ 7, కాంగ్రెస్ 6, బిజెపి 4, ఇండిపెండెంట్‌లు 3 గెలిచారు. సంగారెడ్డిలో 38 వార్డులకు కాంగ్రెస్ 22, బీఆరఎస్ 10, బీజేపీ 02, ఎంఐఎం 1, స్వతంత్ర 3 గెలిచాయి. సదాశివపేటలో 26 వార్డులకు కాంగ్రెస్ 16 బిఆరఎస్ 8, బిజెపి 1 ఇండిపెండెట్ 1 గెలిచారు. ఆందోలులో 20 వార్డులకు కాంగ్రెస్ 16, బిఆరఎస్ 3, బిజెపి 1 గెలిచారు. జహిరాబాద్‌లో 37 వార్డులకు బిఆరఎస్ 15, కాంగ్రెస్ 14, బిజెపి 3, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1 గెలిచాయి. కోహీర్‌లో 16కు 8, బిఆరఎస్ 5, ఇతరులు 3 గెలిచారు. నారాయణఖేడ్‌లో 15కు కాంగ్రెస్ 11, బిఆరఎస్ 3, బిజెపి 1 గెలిచాయి. మెదక్ లో 32 వార్డులకు బిఆరఎస్ 15, కాంగ్రెస్ 14, బిజెపి 2, బిఎస్పి 1 గెలుపొందాయి. నర్సాపూర్ 15 స్థానాలకు కాంగ్రెస్ 6, బిఆరఎస్ 5, బిజెపి 4 గెలిచాయి. తూప్రాన్‌లో 16 స్థానాలకు బిఆరఎస్ 9, కాంగ్రెస్ 4, బిజెపి 3 గెలిచారు. రామాయంపేటలో 12కు, కాంగ్రెస్ 8, బిఆరఎస్ 3, బిజెపి 1 గెలుపొందాయి. హుస్నాబాద్ లో 20కు కాంగ్రెస్ 16, బిఆరఎస్ 4 గెలిచారు. గజ్వేల్‌లో 20 స్థానాలకు బీఆరఎస్ 11, కాంగ్రెస్ 07, బీజేపీ 1, స్వతంత్ర 1 గెలిచారు. చేర్యాలలో 12 స్థానాలకు బిఆరఎస్ 7, కాంగ్రెస్ 5 గెలిచాయి దుబ్బాకలో 20 వార్డులకు బిఆరఎస్ 11, కాంగ్రెస్ 4, బిజె| ¾2, ఫార్వర్డుబ్లాక్ 1, ఇండిపెండెంట్ 1 గెలిచాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *