రేవంత్‌ ‌వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌ఆ‌గ్రహం

– ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌ముస్లింల పట్ల బెదరింపు ధోరణితో ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడారని, అతనిపై చర్య తీసుకోవాలని బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ ‌రెడ్డిని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌ ‌రెడ్డి, మహ్మద్‌ ‌షకీల్‌, నేతలు ప్లలె రవికుమార్‌, ‌కిశోర్‌ ‌గౌడ్‌, ‌సల్మాన్‌ఖాన్‌, ఇతర బీఆర్‌ఎస్‌ ‌మైనార్టీ నేతలు గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల ప్రధానాధికారికి  ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్‌ ‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుదర్శన్‌ ‌రెడ్డిని కోరారు. ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. బీఆర్‌ఎస్‌ ‌ముఖ్య నేతలు, మైనార్టీ నేతలు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *