– వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పణ
– సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా
– కేటీఆర్, హరీష్ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని బైఠాయించారు. దీంతో కేటీఆర్, హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డిలతోపాటు పార్టీ ఎమ్మెల్సీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు హరీష్‌రావు ధర్నాలో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ యూరియా సమస్య లేదని, ఇక్కడి ప్రభుత్వం వైఫల్యం వల్లే కొరత ఏర్పడిరదని చెప్పారు. గత ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా పంపిణీ చేశామని వివరించారు. ఈ సమస్యపై బీజేపీ, కాంగ్రెస్ ఒకదానిపౖౖె ఒకటి నెపం వేసుకొని తప్పించుకుంటున్నాయని దుయ్యబట్టారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని, రైతుల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ సమస్యపై ఒక్కరోజైనా సవిూక్ష చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైనాయన్నారు. కొద్ది రోజులుగా యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా వారి కష్టాలపై బీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తూనే ఉన్నారన్నారు. ఇవాళ కూడా యూరియా కొరతను తక్షణమే తీర్చాలంటూ రైతుల తరపున తాము వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించామని చెప్పారు. అనంతరం హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు సచివాలయాన్ని ఆకస్మికంగా ముట్టడిరచారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రేవంత్ దోషం రైతన్నకు మోసం అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





