కాళేశ్వరంపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇస్తాం

– అనుమతి కోరుతూ స్పీకర్‌కు బిఆర్‌ఎస్‌ ‌వినతిపత్రం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: అసెంబ్లీలో శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ‌ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌విప్‌ ‌కేపీ వివేకానంద, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ ‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేష్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *