కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్నానం కోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది. ఎస్‌ఐ రంజిత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని తిమ్మకుపల్లికి చెందిన కవల సోదరులు రామ్, లక్ష్మణ్(13)లు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సవిూపంలోని చెరువుకు స్నానానికి వెళ్లారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక ఇద్దరూ మునిగిపోయి గల్లంతయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించడంతో మంగళవారం ఉదయం అన్నదమ్ముల మృతదేహాలు బయటపడ్డాయి. కవల సోదరుల మృతితో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలముకొన్నాయి.
చెరువులో మునిగి కవల సోదరుల మృతి





