అక్కను హత్య చేసిన తమ్ముడు

– పోలీస్‌ ‌విచారణలో నేరం అంగీకారం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ‌మండలం బాటసింగారంలో దారుణం చోటుచేసుకుంది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో ఆమెను తమ్ముడు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పును తమ్ముడు పప్పు రామ్‌ ‌గమనించాడు. తీరు మార్చుకోవాలని చెప్పినా.. వినిపించుకోకపోవడంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి మజీద్‌పుర్‌ ‌చెరువులో పడేశాడు. గత నెల 28న ఆమె బాటసింగారంలోని కిరాణ దుకాణానికి వెళ్లి కనిపించకుండా పోయినట్లు పోలీస్‌ ‌స్టేషన్‌లో తమ్ముడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ ‌కేసు నమోదు చేసి తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టడంతో హత్య వ్యవహారం బయటపడింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *