- రన్‌వేపై థాయ్ విమానానికి తప్పిన ముప్పు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: తాజాగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్ 737) ప్రమాదం తప్పింది. బుధవారం ఫుకెట్ ఎయిర్ ఫోర్టులో ల్యాండ్ అయిన వెంటనే నోస్ వీల్ (ఫ్రంట్ ల్యాండింగ్ గేర్) ఊడిపోయింది. దీంతో విమానం రన్ వే నుంచి పక్కకు జారింది. వెనుక టైర్ కూడా పేలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం తక్కువ వేగంతో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సాంకేతిక సమస్య, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు మృతికాగా,చెందిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.