మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30 : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ శుక్రవారం మేడారం మహా జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. మేడారం మహా జాతర ప్రాధాన్యత, నూతనంగా నిర్మించిన గద్దెలు, ఆదివాసీ చరిత్ర, భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర్ ఆయనకు ఆమూలాగ్రం వివరించారు. జాతర విశేషాలను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకిచి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





