మూసీ అభివృద్ధిలో బ్రిటిష్‌ కంపెనీలు భాగస్వాములవ్వాలి

– తన నివాసంలో బ్రిటిష్‌ హై కమిషనర్‌తో సీఎం భేటీ
– ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు సానుకూల స్పందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో బ్రిటిష్‌ కంపెనీలు భాగస్వాములు కావాలని, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్‌, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని బ్రిటిష్‌ హైకమిషనర్‌ లిండీ కామెరాన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బ్రిటిష్‌ హై కమిషనర్‌తో ఆయన గురువారం భేటీ అయ్యారు. డిప్యూటీ హైకమిషనర్‌, హైదరాబాద్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌, పొలిటికల్‌ ఎకానమి అడ్వైజర్‌ నళిని రఘురామన్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి హాజరయ్యారు. సీఎం విజ్ఞప్తులకు హై కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. అలాగే యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌ కో-ఫండిరగ్‌ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్‌ విద్యార్థులకు అందించేందుకు కూడా లిండీ కామెరాన్‌ అంగీకరించారు. ఎడ్యుకేషన్‌, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వారు వివరించారు. యూకే యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్‌ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీ డ్రాఫ్ట్‌ గురించి బ్రిటిష్‌ హైకమిషనర్‌కు సీఎం వివరించగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించేందుకు బ్రిటిష్‌ హైకమిషనర్‌ సుముఖత వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *