ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

– మహిళా సాధికారతకు చిహ్నం మహిళా సమాఖ్య భవనం
– మంత్రి సీతక్క

వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2:ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాలలో వెలుగు కాంతులు వేళ్లు విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు స మాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రా ష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతి రూపాలుగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు.గురువారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని పివి కన్వెన్షన్ హాలు లో ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు మంత్రి సీతక్క హాజరు అయ్యారు. రాష్ట్ర గీతంతో గ్రామసభ కార్యక్ర మం ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖ్య మంత్రి ప్రసంగాన్ని కలెక్టర్ దివాకర టిఎస్ వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని 4 లక్షల 70 వేల మహి ళా సం ఘాల వారికి వడ్డీ లేని రుణాలను అం దించి వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రజా ప్ర భుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ఇటీవల ముగిసిన మేడారం మహా జాతర సందర్భం గా 560 మంది మహిళలకు 6 వందల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు అందించ గా పక్షం రోజులలోనే మూడు కోట్ల 50 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారని తెలిపారు. ప్రస్తుత కాలంలో కల్తీ పాలు అమ్మ కాలు జరుగుతున్న ఈ సంద ర్భంలో స్వచ్ఛ మైన పాలు అందే విధంగా రానున్న రోజుల లో మహిళా సంఘాల వారికి గేదెలను పంపి ణీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, సేకరించిన పాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో సద్వినియోగం చేసుకుంటుందని అన్నారు. అనంతరం వెంకటేపూర్ మండలానికి చెంది న 31 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు వెంకటా పూర్ లో శెట్టి జయ – సదానందం ఇంది ర మ్మ ఇల్లు లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమా నికి మంత్రి సీతక్క, వెంకటాపూర్ లో ఈజి ఎస్ రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాప న చేశారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, సర్పంచ్ సుగుణ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *