ఏసీబీకి చిక్కిన తహసిల్‌ ఉద్యోగులు

– లంచం తీసుకుంటుండగా పట్టివేత

ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ‌మరో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ‌డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ‌రూ. 10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్‌ ‌కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ ‌కోసం తల్లాడ తహసీల్‌ ‌కార్యాలయాన్ని సంప్రదించిన బాధితుడిని అక్కడి అధికారులు లంచం డిమాండ్‌ ‌చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం తహసీల్‌ ‌కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేషర్‌ ‌శివాజీ రాథోడ్‌ ‌రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న తహసీల్దార్‌ ‌వంకాయల సురేష్‌కుమార్‌, ‌రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ ‌మాలోత్‌ ‌భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరిని వరంగల్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశప్టెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *