-డీకే ఇంటికి వచ్చి అల్పాహారం చేసిన సిద్దు
– అధిష్టానం ఆదేశిస్తే డీకే సీిఎం అవుతారని కామెంట్
బెంగళూరు, డిసెంబర్ 2 : కర్ణాటకలో నాయకత్వ (సీఎం) మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నవేళ బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఉదయం డీకే ఇంటికి సీఎం సిద్ధూ అల్పాహారానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇంటికి వచ్చిన సీఎంకు డీకే ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. శివకుమార్‌కు సీఎం పదవిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం అవుతారన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూల అమలే పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ నేతలిద్దరూ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు సహా పలు ఇతర విషయాలపైనా చర్చించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయాల్లో చర్చలు జరపడానికి పార్టీ హైకమాండ్ పిలిస్తే తాము ఇద్దరం దిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంలోని నేతలంతా ఐక్యంగా ఉన్నామని, రాష్టాభ్రివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఈనెల 8న కాంగ్రెస్ ఎంపీల సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





