డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ

– ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఏర్పాటుకు సీవోఎల్‌తో ఎంవోయూ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ(ఐడీఈఏ) ఏర్పాటుకు కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌(సీవోఎల్‌)తో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ అభివృద్ధి చెందనున్నది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ అత్యాధునిక డిజిటల్‌ హబ్‌గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా బీఆర్‌ఏవోయూ నాణ్యమైన విద్యను అందించనున్నది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీవోఎల్‌ అధ్యక్షుడు పీటర్‌ స్కాట్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో పీటర్‌ స్కాట్‌, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఘంటా చక్రపాణి, సీిఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page