వైభవంగా సాగుతున్న యాద‌గిరీశుడి బ్రహ్మోత్సవాలు

– గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చిన నారసింహుడు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని గోవర్ధనగిరిధారి అలంకరణలో భక్తులు సేవించారు. భక్తజన రక్షణే ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింబించే అలంకరణలో దివ్య మనోహరంగా భక్తజనులకు దర్శనమిచ్చారు. తన చిటికెన వేలితో గోవర్థన పర్వతాన్ని ఎత్తిపట్టి గోపాలురను రక్షించిన మహిమల గురించి అలంకార విశిష్టతను భక్తులకు అర్చకులు వివరించారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వైభవంగా ఊరేగించారు. ఉత్సవాలను ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, అర్చక బృందం, వేదపడింతులు, రుత్వికులు శాశ్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, ఈవో భవానీశంకర్, డీఈవో దోర్బల భాస్కరశర్మ, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఉద్యోగ, సిబ్బంది, భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *