#Hydra marshals: హైడ్రా మార్షల్స్‌ విధుల బహిష్కరణ

– ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: హైడ్రా (HYDRA) మార్షల్స్‌ వేతనాల్లో ఊహించని తగ్గింపుతో వారు (మాజీ సైనికులు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించడంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సేవలపై తీవ్ర ప్రభావం పడిరది. హైడ్రా మార్షల్స్‌(Marshals)లో చాలామంది మాజీ సైనికులున్నారు(ex-servicemen). వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతోపాటు, వర్షా కాలంలో వరద సమస్యలు తగ్గించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తారు. కానీ, ఇటీవల వీరి వేతనాలను తగ్గించడంతో విధులను బహిష్కరించారు. దీంతో 150 డివిజన్లలో హైడ్రా సేవలు బంద్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో మాన్సూన్‌ ఆపరేషన్స్‌ సహా అనేక సేవలపై దీని ప్రభావం కనిపిస్తోంది. హౖాెడ్రా కంట్రోల్‌ రూమ్‌, ప్రజావాణి సేవలు కూడా నిలిచిపోయాయి. నగరంలోని 11 అండర్‌పాస్‌ల నిర్వహణ, క్యాచ్‌పిట్‌ల శుభ్రత, నాలాల క్లీనింగ్‌ వంటి కీలక పనులు కూడా నిలిచిపోయాయి. ఈ సమ్మె వల్ల హైడ్రా, జీహెచ్‌ఎంసీల మధ్య సమన్వయం కూడా దెబ్బతింటోంది. మార్షల్స్‌ డిమాండ్‌లను పరిష్కరించి, త్వరగా సేవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.

మార్షల్స్‌తో అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు: రంగనాథ్‌

హైడ్రాలో సిబ్బందికి జీతాలు తగ్గే అవకాశం లేదని, మార్షల్స్‌ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించబోమని, మార్షల్స్‌ జీతాలు కూడా భవిష్యత్తులో పెరుగుతాయని కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు ఓవర్‌టైం చెల్లింపులు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్‌ భరోసాతో ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో జీతాల తగ్గింపుపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక్క స్కేల్‌ జీతం విడుదల చేశామని, జీతాలు తగ్గే అవకాశం లేదని అన్నారు. చిన్న గందరగోళం కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారని, ఈ అంశాన్ని తాము వారికి వివరించి వారిలో భరోసా నింపామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *