విషగుళికలు కలిపిన బాలామృతం తిని చిన్నారి మృతి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోతుల బెడద తప్పించుకోవడానికి పెట్టిన విషగుళికలు తిని నాలుగేళ్ల బాలుడు మరణించాడు. గోవిందరావుపేటలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కోతులను చంపేందుకు అంగన్‌వాడీ కేంద్రంలోని నర్సరీ ప్రాంతంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చిన్న పిల్లలకు ఇచ్చే బాలామృతంలో వాసన లేకుండా ఉండే విష గుళికలను కలిపి పెట్టారు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఆరఎంపీ వైద్యుడు శ్రవణ్ కుమారుడు హర్షిత్ నందన్ (4) ఆదివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటూ అంగన్‌వాడీ కేంద్రం సమీపంలోకి వెళ్లాడు. ఆ సమయంలో విష గుళికలు కలిపిన బాలామృతాన్ని చూసి దాన్ని తిన్నాడు. అనంతరం అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *