యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన లక్ష్మీ పుష్కరిణి(కొండ కింద)లో కాలు జారి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మియాపూర్ అబ్జిపేట్‌కు చెందిన టికోలు బుజ్జమ్మ, సిద్ధుల కుటుంబం గుండం సమీపంలో కళ్యాణకట్ట వద్ద ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల నుండి వేరుపడి గుండం వద్దకు వెళ్లిన వారి కుమారుడు సంతోష్(10) గుండంలో కాలు జారిపడి ఊపిరాడక మృతిచెందాడు. బాలుడి తల్లి బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తాము మంగళవారం రాత్రి తెలిసిన వారితో యాదగిరిగుట్ట స్వామివారి దర్శనానికి వచ్చామని, రాత్రి కల్యాణ కట్ట వద్ద బస చేయగా బుధవారం ఉదయం ఇలా జరిగిందని బాలుడి తల్లి బుజ్జమ్మ చెప్పిందని సీఐ భాస్కర్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




