పేదరికంలో ఉన్న పిల్లలే బలిపశువులు

మానవ అక్రమ రవాణాకు బలవుతున్న బాల్యం

– ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌-బాండెడ్‌ లేబర్‌’పై వర్క్‌షాప్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: బలమైన కుటుంబ నిర్మాణం లేక తక్కువ విద్య ఉన్న దిగువ సామాజిక వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేసి వారిచే వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు మీడియా అకాడమి చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌(ఐజేఎం) సంయుక్తంగా ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌-బాండెడ్‌ లేబర్‌’ అంశాలపై నాంపల్లిలోని మీడియా అకాడమి ఆడిటోరియంలో మంగళవారం వర్క్‌షాప్‌ నిర్వహించాయి ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మానవ అక్రమ రవాణా సమాజంలో అత్యంత దుర్బల వర్గాల వారిపై ప్రభావం చూపుతున్నదన్నారు. బాధితుల్లో సగానికిపైగా బలవంతపు లేదా బాండెడ్‌ లేబర్‌లో ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి రిపోర్టింగ్‌ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. గృహ పని, నిర్మాణం వంటి తక్కువ నైపుణ్యం కలిగిన రంగాలలో పని కోరుకునే భారతీయ వలసదారులు వివిధ దేశాలకు వలసల పేరుతో అక్రమ రవాణాలో చిక్కుకుంటున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణా నేరాలకు సంబంధించిన దర్యాప్తు ఆధారాలను సేకరించడం, ప్రాణాలతో బయటపడిన వారిని విడిపించడం, అక్రమ రవాణాదారులను అరెస్టు చేయడంలో పోలీసులకు సహాకారం అందించి బాధితులకు న్యాయం జరిగేలా తమ సంస్థ కృషి చేస్తోందని ఐజేఎం ఎన్జీవోల బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, ఐజేఎం మీడియా కమ్యూనికేషన్స్‌ అధిపతి ప్రియా అబ్రహాం, ఐజేఎం ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *