హైదరాబాద్, జూలై 18 : మాసబ్ ట్యాంక్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు శుక్రవారం జరిగాయి. ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపులు, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సమాచార భవన్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాలలు సమర్పించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనలతో పలు కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో సమాచార శాఖ సంచాలకులు ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు, అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, జాయింట్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, సమాచార శాఖ మాజీ డైరెక్టర్ సుభాష్ గౌడ్, %జIజు% రాధాకిషన్, డిప్యూటి డైరెక్టర్లు యం.మధుసూధన్, సి.రాజారెడ్డి, జి.ప్రసాద్ రావు, కె.వి.సురేష్, %RIజు% జయ రామ్మూర్తి, సహాయ సంచాలకులు ప్రణీత్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, బిమల్ దేవ్, %ణవ.I.జు% నర్సింహా గౌడ్, అకౌంట్స్ ఆఫీసర్లు పద్మ, హేమ, %ుచీGూం% నాయకులు అనిల్, జితేందర్ , దుర్గప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు





