– వారంలో ఇది రెండోసారి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రొటోకాల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీఐఎసఎఫ్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగి ప్రతి ప్రదేశాన్నీ జాగ్రత్తగా పరిశీలించాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. ఇటీవల కూడా ఇలాంటి ఈ-మెయిల్ రావడంతో భద్రతా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోర్టులను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు పేరుతో ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం. ఈ-మెయిల్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం హైకోర్టు ప్రాంగణంలో భద్రతను మరింత పెంచి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




