– తనిఖీలు చేపట్టి ఫేక్ కాల్‌గా గుర్తింపు
హైదరాబాద్, మార్చి 6: విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇటీవల బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. తాజాగా బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. నిత్యం వాతావరణ సమాచారం అందించడంలో బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. భద్రతా కారణాల దృ ష్ట్యా సిబ్బందిని కార్యాలయం బయటకు పంపి అంతటా తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఫేక్ బాంబ్ బెదిరింపులు రావడం ఎక్కువైంది. ఇది కూడా ఆకతాయిల పనే అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందొద్దని, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





