– భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ హెచ్చరిక
– బాధాతప్త హృదయంతో ఇక్కడికి వొచ్చానని వెల్లడి
న్యూదిల్లీ, నవంబర్ 11: దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వొదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని.. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో నూ వదలబోమని దేశ ప్రజలకు హా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ రాజధాని థింఫులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బాంబు పేలుడు వెనక ఉన్న కుట్రదారులను వదలబోమని.. బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. దిల్లీ పేలుడు మనసు కలిచి వేసిందన్నారు. భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ.. దిల్లీ పేలుడుపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్ వొచ్చాను. బాధితుల దు:ఖాన్ని అర్థం చేసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. దిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోం.
కుట్రదారులను చట్టం ముందు నిలబెడతాం. ఇప్పటికే ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించాం. దిల్లీ ఘటనపై ఎప్పటికప్పుడు సక్షిస్తూనే ఉన్నాం. పేలుడుపై అర్ధరాత్రి వరకు సక్షలు చేస్తూనే ఉన్నాం. బాధితుల వెంట దేశమంతా ఉందని మోదీ తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మంగళవారం ఉదయం భూటాన్ వెళ్లారు. పర్యటన ముగించుకుని బుధవారం దిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5:30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





