భారత్‌పై పేలనున్న మరో బాంబ్‌

– ఏకంగా 500 శాతం సుంకాల వింధింపునకు రెడీ
– బిల్లును సిద్దం చేసిన అమెరికా

వాషింగ్టన్‌,‌ జనవరి 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత్‌పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే కీలక బిల్లుకు ఆయ‌న‌ గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయంపై రిపబ్లికన్‌ ‌సెనెటర్‌ ‌లిన్స్ ‌గ్రాహం ఎక్స్‌లో ఓ పోస్ట్ ‌చేశారు. ట్రంప్‌తో జరిగిన భేటీలో పలు కీలక విషయాల గురించి చర్చలు జరిపినట్టు తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్‌ ‌జరగనుందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో పుతిన్‌ ‌చేస్తున్న దారుణాలకు రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్‌, ‌చైనా, బ్రెజిల్‌ ‌దేశాలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని గ్రాహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా బిల్లు ప్రకారం ఆయా దేశాలపై 500 శాతం సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుందని గ్రాహం తెలిపారు  బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి ఇతర దేశాలు చమురు కొనడం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో ప్రస్తుతం చైనా మొదటి స్థానంలోనూ, భారత్‌ ‌రెండో స్థానంలోనూ ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపడానికి ట్రంప్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే భారత ఉత్పత్తులపై 50 శాతం సంకాలు విధించారు. అయినా భారత్‌ ‌రష్యా నుంచి చవకగా వస్తున్న చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌రష్యాపై బెదిరింపులకు దిగారు. రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై  టారిఫ్‌లను విధించేందుకు సిద్ధమయ్యారు. గ్రాహం-బ్లూమెంటల్‌ ‌బిల్లు ఆమోదం పొందితే, రష్యా చమురు లేదా యురేనియంను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అనుమతి లభిస్తుంది. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో బుధవారం సమావేశమయ్యానని గ్రాహం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ‌నెలలతరబడి చర్చిస్తున్న బిల్లుకు తన మద్దతు తెలిపారన్నారు. వైట్‌హౌస్‌ ‌సీనియర్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ధృవీకరించారు.  వచ్చే వారం ప్రారంభంలో ఓటింగ్‌ ‌జరగవచ్చని గ్రాహం అన్నారు. ఈ బిల్లుని హౌస్‌ ఆమోదిస్తే ప్రస్తుతం పరిశీలిస్తున్న స్కేల్‌-‌బ్యాక్డ్ ‌ప్రభుత్వ నిధుల ప్యాకేజీని వచ్చే వారం సెనెట్‌ ‌చేపట్టనుంది. అంటే రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి విధించేందుకు రూపొందించింది. గతంలో ఈ బిల్లులో కొన్ని సవరణలు చేపట్టాలని వైట్‌హౌస్‌ ‌సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *