బాలిస్టిక్‌ క్షిపణుల పరీక్ష విజయవంతం

న్యూదిల్లీ, జులై 18: స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ది స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ (ఆధ్వర్యంలో వీటిని గురువారం పరీక్షించారు. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్‌, టెక్నికల్‌ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది.

పృథ్వీ 2 మిస్సైల్‌ ప్రత్యేకతలు

ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ది స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ దీనిని వాడుతుంది. ఈ క్షిపణి రేంజ్‌ 350 కి.మీ. 500 నుంచి వెయ్యి కిలోల బరువును మోసుకెళ్లగలదు.

అగ్ని 1 మిస్సైల్‌ ప్రత్యేకతలు

ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి రేంజ్‌ 700 నుంచి 900 కి.మీ. ఇది వెయ్యి కిలోల యుద్ధ సామగ్రిని మోసుకెళ్లగలదు. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *