ములుగు, ప్రజాతంత్ర, జులై 23: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేస్తున్నట్లు ములుగు డీఎఫ్‌వో కిషన్ జాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యందార, కొంగర, మామిడిలొద్ది, కృష్ణపురం జలపాతాలను ప్రయాణీకుల భద్రతా కారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులు అటు వైపు వెళ్లవద్దని సూచించారు.. అటవీ అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేసిన వారిపై పోలీసు కేసును నమోదు చేస్తామని తెలిపారు..
బొగత జలపాత సందర్శన నిలిపివేత




